.
ఐదు నిమిషాల్లో రామ్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం – చెన్నైలో జరిగిన ‘ది వారియర్’ సినిమాలని ‘బుల్లెట్…’ సాంగ్ ఆవిషకరణలో ఉదయనిధి స్టాలిన్
రామ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘ది వారియర్’. తమిళ అగ్ర దర్శకుడులింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసాచిట్టూరి నిర్మిస్తున్నారు. సినిమాలో తొలి పాట, ప్రముఖ తమిళ హీరో శింబు పాడిన’బుల్లెట్…’ను శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు.
చెన్నైలో శుక్రవారం సాయంత్రం ఓ థియేటర్లో కోలాహలంగా జరిగిన కార్యక్రమంలో’బుల్లెట్…’ సాంగ్ తమిళ్ వెర్షన్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, యంగ్ స్టార్ హీరోఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా హీరో రామ్, నిర్మాత శ్రీనివాసచిట్టూరి, హీరోయిన్ కృతి శెట్టి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, ఆది పినిశెట్టి, చిత్రసమర్పకులు పవన్ కుమార్, ఛాయాగ్రాహకుడు సుజీత్ వాసుదేవ్, కళా దర్శకుడు డి.వై. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు ఎనర్జిటిక్ ట్యూన్ అందించగా, తెలుగులో శ్రీమణి అంతేహుషారైన సాహిత్యం అందించారు. తమిళ వెర్షన్‌కు వివేక్ లిరిక్స్ రాశారు. శింబుతో పాటుహరిప్రియ ఆలపించారు. ‘కమాన్ బేబీ… లెట్స్ గో ఆన్ ద బుల్లెట్! ఆన్ దవేలో పాడుకుందాం డ్యూయెట్’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియోలో రామ్, కృతి శెట్టి జోడీవేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ‘బుల్లెట్…’ సాంగ్ ఇన్‌స్టంట్ ఛార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ “ఒక లిరికల్ వీడియో (సాంగ్)ను ఇంత ఘనంగాఆవిష్కరించడం ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు. సాంగ్ చాలా బావుంది. రామ్ తో నాకు ఇంతకు ముందు పరిచయం లేదు. ఇప్పుడే పరిచయం అయ్యింది. ఐదునిమిషాల్లో మంచి ఫ్రెండ్ అయిపోయారు. లింగుస్వామి ఫోన్ చేసి ఈ ఫంక్షన్ కి రావాలనిచెప్పినప్పుడు… అసెంబ్లీ ఉందని చెప్పా. అప్పుడు 21 నుంచి 22కు ఫంక్షన్ డేట్ మార్చారు. ఆయన, రామ్ కలిసి చేసిన ‘ది వారియర్’ సినిమా రామ్ నటించిన విజయవంతమైనసినిమాల్లో ఒకటిగా నిలవాలి. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. రామ్ తెలుగులో నటించిన’రెడ్’ సినిమా తమిళ్ వెర్షన్ ‘తడమ్’ నేను చేయాలి. కానీ, కుదరలేదు. ఇప్పుడు ‘తడమ్’ దర్శకుడు తిరుమేనితో సినిమా చేస్తున్నాను” అని చెప్పారు.
రామ్ మాట్లాడుతూ “తప్పు చేస్తే వెంటనే అందరికీ తెలుస్తుంది. అదే మంచి చేస్తే అంతగాప్రచారం జరగదు. అయితే… కరోనా సమయంలో ఉదయనిధి స్టాలిన్ చేసినసేవల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకూ తెలిసింది. ఈ సాంగ్ విడుదల కార్యక్రమంలోఆయన పాల్గొనడం సంతోషంగా ఉంది. లింగుస్వామి ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఆదిపినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారని చెప్పారు. నేను షాక్ అయ్యా. ఆదితో నటించడంమంచి ఎక్స్‌పీరియన్స్. దర్శకుడు లింగుస్వామి ప్రతి సన్నివేశాన్ని ఎంతో కేర్ తీసుకునిచేశారు. కృతి శెట్టితో తొలిసారి నటించా. తను మంచి కోస్టార్. నేను చెన్నైలో పెరిగా, ఇక్కడేచదువుకున్నాను. నా మొదటి సినిమా తమిళంలో చేయాల్సింది. ఇప్పుడు తమిళంలోసినిమా చేయడం సంతోషంగా ఉంది” అని అన్నారు.
దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ“ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథిఉదయనిధి స్టాలిన్ గారికి థాంక్స్. ‘బుల్లెట్…’ సాంగ్ కోసం మా నిర్మాత మూడు కోట్లు ఖర్చుపెట్టారు. సినిమాను గ్రాండ్ గా తీశారు. సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోచెబుతా” అని అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ “నేను, రామ్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. తెలుగులో మేం 7 సినిమాలు చేశాం. ఈ సినిమాతో రామ్ తమిళ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తనకు వెల్కమ్ చెబుతున్నాను. సాంగ్ పాడాలని శింబును అడిగిన వెంటనే ఒప్పుకొన్నాడు. అతడికి థాంక్స్. దర్శకుడు లింగుస్వామితో ఎప్పటి నుంచో సినిమా చేయాలనిఅనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుంది” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, ఇతర యూనిట్ సభ్యులుమాట్లాడారు.
రామ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా, ఆది పినిశెట్టి విలన్ గా, అక్షరా గౌడ, నదియా కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై. సత్యనారాయణ, యాక్షన్: విజయ్ మాస్టర్ & అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా – లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసాసిల్వర్ స్క్రీన్, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఎన్. లింగుస్వామి.
In a cinematic era dominated by high-speed action and multiverse fantasies, Ek Deewane Ki Deewaniyat…
Bollywood superstar Shah Rukh Khan opened up about Kajol going the extra mile to recreate…
Actress Priyamani opened up about her experience working with veteran actor Manoj Bajpayee on the…
Former Bigg Boss winner Gauahar Khan has been actively voicing her views on the ongoing…
Randeep Hooda and his wife Lin Laishram shared a glimpse from their Karva Chauth celebrations…
Actress Shagun Sharma, who plays Paridhi in "Kyunki Saas Bhi Kabhi Bahu Thi Season 2",…