.
బూట్ కట్ బాలరాజు గ్లింప్స్ విడుదల
సోహెల్, అనన్య (వకీల్‌సాబ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బూట్ కట్ బాలరాజు. లక్కీ మీడియాతో కలిసి గ్లోబల్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కొన్నేటి దర్శకుడు. సోమవారంనాడు సోహెల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ బూట్ కట్ బాలరాజు గ్లింప్స్ విడుదల చేసింది.
`రింగు రింగు రూపాయ్ బిళ్ళ రూపాయి దండ.. అంటూ సాగే పాటతోపాటు సోహెల్ యాక్షన్ సీన్స్ ఆకర్షణీయంగా వున్నాయి. దానికితోడు ఊరికి ఒక మంచి పని చేసినావ్‌ర్రా అంటూ ఒకరు అడిగితే.. సోహెల్ చెప్పే సమాధానం ఫుల్ ఎంట్‌టైన్ చేస్తుంది. ఈరోజు విడుదలైన గింప్స్ మంచి ఆదరణ చూరగొంటుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, రచయిత ఫణి, రాకేష్, అశోక్ కుమార్ టీమ్‌గా ఫామ్ అయి మంచి కథను అందించారు. 9నెలలుగా కథను రెడీ చేసి షూటింగ్‌కు వెళ్ళాం. ఏకధాటిగా సాగిన షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈరోజు సోహెల్ పుట్టినరోజు సందర్భంగా బూట్ కట్ బాలరాజు గ్లింప్స్ విడుదల చేశాం. కుటుంబంతో కలిసి హాయిగా చూడతగ్గ సినిమా అవుతుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు.
సోహెల్ మాట్లాడుతూ, కథ బాగుంటే అన్నీ కలిసి వస్తాయి. బిగ్‌బాస్‌లో వచ్చిన పేరు వేరు. సినిమా ద్వారా వచ్చే పేరు వేరు. అందుకే నన్ను నమ్మి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్ మెంట్ ఇచ్చేలా కృషి చేస్తున్నానని అన్నారు.
తారాగణంః సొహెల్, అనన్య తదితరులు
సాంకేతికతః కెమెరాః గోకుల్, సంభాషణలుః ఫణి, రాకేష్, అశోక్ కుమార్, సంగీతంః భీమ్స్, సాహిత్యంః కాసర్ల శ్యామ్, సమర్పణః బెక్కెం బబిత, నిర్మాతలుః బెక్కెం వేణుగోపాల్, బాష, దర్శకత్వంః శ్రీ కొన్నేటి.
Singer Neha Kakkar made a special tattoo for brother Tony Kakkar, amidst tension with…
Actress and former Miss Universe Lara Dutta said 'One more round around the sun done…
Actress and fashion diva Sezal Sharma is turning up the heat and redefining glam in…
Actress Anu Aggarwal, who rose to fame with the original ‘Aashiqui’, has shared her thoughts…
Actor Jay Thakkar feels like the universe is aligning in his favor as he gets…
Bollywood isn't just a film industry, it's a vibrant celebration of color, drama, and timeless…